బేసన్‌ చీలా రైతా
 • 374 Views

బేసన్‌ చీలా రైతా

కావలసినవి:

 • శనగపిండి: 3/4 కప్పు
 • చిక్కటి పెరుగు : 2 కప్పులు
 • ఉప్పు: తగినంత
 • కారం: 1 టీ స్పూన్‌
 • జీలకర్ర: 1/2 టీస్పూన్‌
 • మెంతులు: 1/2 టీ స్పూన్‌
 • బేకింగ్‌ సోడా: చిటికెడు
 • నూనె: ఒక టీ స్పూను
 • పంచదార: 1 టీ స్పూన్‌
 • ఇంగువ: చిటికెడు
 • కొత్తిమీర: తరిగినది 1 స్పూన్‌

విధానం:

శనగ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో తగినంత ఉప్పు, అరచెంచా కారం, జీలకర్ర, మెంతిపొడి కలపాలి. తర్వాత అందులో తగినంత నీరు పోసి చిక్కటి పిండి తయారు చేయాలి. ఎటువంటి గడ్డలూ లేకుండా బాగా దానిని మెదపాలి. అందులో బేకింగ్‌ సోడా వేసి మళ్ళీ బాగా గిలకొట్టినట్టు కలపాలి. పొయ్యి మీద తావను వేడి చేసి దానికి కొద్దిగా నూనె రాయాలి. శనగపిండిని స్పూన్‌తో తీసుకుని చిన్న చిన్న రొట్టెలలా వేయించాలి. అవసరమైతే వేగటానికి కొంత నూనె వేయవచ్చు. రెండువైపులా బంగారు రంగు వచ్చేదాకా వాటిని వేయించాలి. పెరుగులో ఒక అరకప్పు నీరు పోసి మిగిలిన కారం, చక్కెర అందులో వేసి రుచి కోసం ఉప్పు కలపాలి. చిన్న రొట్టెలను ఈ పెరుగలో వేయాలి. చిన్న బాణలి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి మిగిలిన జీలకర్రను వేయించాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత మెంతిపొడి, ఇంగువ వేసి పోపు పెట్టి దానిని పెరుగు మీద వెయ్యాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి. ఇవి విడిగా తినడానికి కూడా బాగుంటుంది.