కాకరకాయ మసాలా
  • 337 Views

కాకరకాయ మసాలా

కావలసినవి:

  • చిన్న కాకరకాయలు - పావుకిలో,
  • ఉల్లిపాయలు - 150 గ్రాములు,
  • కారం - 1 టేబుల్‌ స్పూన్‌,
  • నూనె- 3 టేబుల్‌ స్పూన్లు,
  • ఉప్పు - తగినంత తాలింపు
  • గింజలు - 1 టేబుల్‌ స్పూన్‌

విధానం:

కాకరకాయల్ని ఓ పక్క చీల్చి విత్తనాలు తీసెయ్యాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. వాటికి ఉప్పు, కారం కలిపి ఈ మిశ్రమాన్ని కాకరకాయల్లో కూర్చి అది బయటికి రాకుండా దారం కట్టాలి. బాండీలో నూనె కాగాక పోపు గింజల్ని వేయించాలి. తర్వాత కాకరకాయల్ని వేసి పైన నీళ్ల గిన్నె మూత పెట్టి, సన్న మంటమీద మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మాడకుండా కదిలిస్తుండాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించి దింపితే చాలు.