బొంబాయి చికెన్‌
  • 591 Views

బొంబాయి చికెన్‌

కావలసినవి:

  • చికెన్‌ లెగ్‌ పీసెస్‌ ఆరు
  • గుడ్డు - 1
  • అల్లం వెల్లుల్లి పేస్టు - 2 చెంచాలు
  • నిమ్మరసం - 2 స్పూన్లు
  • తెల్ల మిరియాల పొడి - పావు టీ స్పూన్‌
  • పచ్చిమిర్చ - ఆరు
  • సోయాసాస్‌ - 3 టేబుల్‌ స్పూన్లు
  • టొమాటో సాస్‌ - 2 స్పూన్ల్‌
  • రిఫైండ్‌ ఆయిల్‌ ఫ్రైచేయడానికి సరిపడా
  • కార్న్‌ ఫ్లోర్‌ - 2 స్పూన్లు

విధానం:

తయారు చేసే విధానం: ముందుగా చికెన్‌ లెగ్‌ పీసులు శుభ్రంగా కడిగి వాటిని చాకుతో సన్నగా గీరాలి. ఇలా అన్ని వైపులా గాటు పెట్టి ఉప్పు, నిమ్మరసం పట్టించి కొద్దిసేపు నానబెట్టాలి. ఈలోగా పచ్చిమిర్చిని ముద్దగా నూరుకొని, సోయాసాస్‌, టొమాటో సాస్‌, మైదా, కార్న్‌ఫ్లోర్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, కొత్తిమీర, తెల్లమిరియాల పొడి, గుడ్డును కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని చికెన్‌ ముక్కలకు బాగా పట్టించి మరో 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు స్టౌ మీద ఓ బాణలి పెట్టి అందులో వేయించడానికి సరిపడా నూనెపొయ్యాలి. నూనె బాగా వేడెక్కిందని నిర్ధారించుకున్న తర్వాత ఒక్కో లెగ్‌పీస్‌ ను వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేడి చల్లారాక ముందే గీన్‌ చిల్లీ సాస్‌ తో వేడి వేడిగా లాగిస్తే ఆటేస్టే వేరు అనాల్సిందే మరి...