రవ్వలో పెరుగు కలిపి రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, సోడాఉప్పు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసి కాగిన నూనెలో వేయించాలి. అంతే వేడివేడి రవ్వ వడలు తయార్. వేడివేడిగా ఏదైనా సాస్‌తో తింటే చాలా బావుంటాయి.