బూందీ రైతా
  • 237 Views

బూందీ రైతా

కావలసినవి:

  • బూందీ: 100 గ్రా.
  • పెరుగు: 1 కప్పు
  • ఉప్పు: తగినంత
  • వేయించిన జీలకర్ర పొడి:
  • 1/2 టీ స్పూను
  • కొత్తిమీర తరిగినది:
  • 2 టేబుల్‌ స్పూన్లు
  • కారం: 1/2 టీ స్పూన్‌

విధానం:

పెరుగును చిక్కగా చిలుక్కోవాలి. దానిలో ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, తరిగిన కొత్తిమీర ఆకులలో సగం వేయాలి. అందులో బూందీ వేసి గరిటతో బాగా కలపాలి. తర్వాత మిగిలిన జీలకర్ర పొడి, కొత్తిమీర ఆకులు, కారం వేసి సర్వ్‌ చేయడమే. దీనిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది.