జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా వేసి కలిపి, తరవాత నీళ్లు పోసి చపాతీపిండిలా కలిపి పక్కన ఉంచాలి. ప్యాన్‌లో రెండు చెంచాల నూనె వేడి చేసి వేరుశనగపప్పు వేసి వేగాక, బూందీ, సేవ్, కిస్మిస్, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు కారంపొడి, ఉప్పు, చాట్‌మసాలా వేసి కొద్దిసేపుంచి దింపేయాలి. పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి. ఒక భాగం తీసుకుని అంచులు తడి చేసి కోన్‌లా మడిచి రెండు చెంచాల బూందీ మిశ్రమాన్ని అంచులు విడిపోకుండా ఒత్తి సమోసా మడిచి వేడి నూనెలో బంగారు రంగువచ్చేవరకు వేయించాలి.