బోటీ కబాబ్
  • 340 Views

బోటీ కబాబ్

కావలసినవి:

  • మటన్ - పావు కేజీ (చిన్నచిన్న ముక్కలు)
  • జీలకర్రపొడి - టీ స్పూను
  • మిరియాలు - 8
  • పెరుగు - 2 టీ స్పూన్లు
  • పచ్చిమిర్చి - 4 (పేస్ట్ చేయాలి)
  • ఉప్పు - తగినంత; ఎండుమిర్చి - 2
  • శనగపిండి - 2 టీ స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
  • ఆవనూనె -2 టీ స్పూన్లు

విధానం:

ఈ పదార్థాలన్నిటినీ (ఆవనూనె తప్ప) కలిపి అరగంటసేపు నాననివ్వాలి. బొగ్గుల కుంపటి వెలిగించి పక్కన ఉంచుకోవాలి. గట్టిపుల్లలను తీసుకుని వాటికి ఈ ముక్కలకు గుచ్చి, కొద్దిగా నూనె రాసి నిప్పుల మీద ఉంచి బాగా కాలిన తరువాత ప్లేట్‌లోకి తీసుకోవాలి.