బ్రెడ్‌ పెరుగు వడ
  • 327 Views

బ్రెడ్‌ పెరుగు వడ

కావలసినవి:

  • బ్రెడ్‌ : 5 స్లైసులు
  • ఉల్లిపాయ: 1 (సన్నగా తరగాలి)
  • అల్లం తురుము: 1 టీ స్పూన్‌
  • పచ్చి మిర్చి : 2
  • పెరుగు : ఒక కప్పు
  • ఉప్పు: తగినంత
  • కారం: కొద్దిగా
  • చాట్‌ మసాలా: 1 టీ స్పూన్‌
  • నూనె: తగినంత
  • కొత్తిమీర: అలంకరణకు సరిపడ

విధానం:

పెరుగులో అల్లం తురుము, కారం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో ఒకసారి తిప్పాలి. బ్రెడ్‌ చివరలు కట్‌ చేసి స్లైస్‌ను నీటిలో ముంచి నీరంతా పిండేయాలి. ఆ తర్వాత రెండు చేతుల మధ్య అదిమి మధ్యలో రంధ్రం చేయాలి. అప్పుడు చూడటానికి వడలా వస్తుంది. బాణలి పెట్టి అందులో నూనె పోసి సన్నని మంట మీద ఉంచి ఈ బ్రెడ్‌ వడలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత మిక్సీలో తిప్పి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేయాలి. ఐదు నిమిషాలలో తీసి పక్కన పెట్టి పైన చాట్‌ మసాలా, ఉల్లిపాయ ముక్కలు చల్లాలి. కొత్తిమీరతో అలంకరించి సర్వ్‌ చేయడమే. చాలా సులువుగా త యారైపోతాయి ఈ వడలు. పిల్ల లు కూడా ఇష్టంగా తింటారు.