బ్రెడ్ ఫటర్స్
  • 141 Views

బ్రెడ్ ఫటర్స్

కావలసినవి:

  • బ్రెడ్ స్లైసులు - 6
  • శనగపిండి - 100 గ్రా.
  • బంగాళదుంపలు - 100 గ్రా.
  • కారం - టేబుల్ స్పూను
  • పచ్చిమిర్చి - 3
  • నూనె - 500 గ్రా.
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వెల్లుల్లి రేకలు - 12
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - అర టేబుల్ స్పూన్
  • పసుపు - అర టేబుల్ స్పూన్
  • చాట్ మసాలా - అర టేబుల్ స్పూన్
  • ఉల్లిపాయలు - 50 గ్రా.
  • ధనియాల పొడి - అర టీ స్పూన్
  • జీలకర్ర పొడి - అర టీ స్పూన్

విధానం:

బాణలిలో కొద్దిగా నూనె కాగిన తరవాత ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి పక్కనుంచాలి. గిన్నెలో శనగపిండి, ఉప్పు, కారం, నీరు పోసి బజ్జీలపిండి మాదిరిగా కలపాలి. బ్రెడ్ స్లైసెస్ అంచులు కట్ చేయాలి. ఒక గిన్నెలో కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉడికించి చిదిమిన బంగాళదుంప పేస్ట్, వేయించి పెట్టుకున్న ఉల్లితరుగు వేసి ముద్దలా కలపాలి. ఈ ముద్దను బ్రెడ్ స్లైస్ మీద కొంచెం మందంగా పరిచి దాని మీద మరో బ్రెడ్ స్లైస్ (శాండ్‌విచ్ మాదిరిగా) ఉంచి పక్కనుంచాలి. స్టౌ మీద బాణలిలో నూనె బాగా కాగిన తరవాత వీటిని ఒక్కొక్కటిగా పిండిలో ముంచి నూనెలో వేసి రెండు వైపులా వేయించి తీసేయాలి. తరవాత వాటిని మధ్యకి కట్ చేసి సర్వ్ చేస్తే బావుంటాయి.