బ్రెడ్‌ పుడ్డింగ్‌
  • 434 Views

బ్రెడ్‌ పుడ్డింగ్‌

కావలసినవి:

  • బ్రెడ్డు: 8 స్లైసులు
  • కిస్మిస్‌ : 1/2 కప్పు
  • పాలు: 4 కప్పులు
  • గుడ్డు: 1
  • వెనిల్లా ఎసెన్స్‌: 1 టేబుల్‌ స్పూన్‌
  • పంచదార: 3 టేబుల్‌ స్పూన్లు
  • దాల్చినచెక్క పొడి: 1/2 టీస్పూన్‌

విధానం:

ఒవెన్‌ను ముందుగా 350 డిగ్రీల వరకూ వేడి చేసుకోవాలి. కాసరోల్‌లో కాస్త నూనె రాయాలి. తర్వాత ముక్కలుగా చేసుకున్న బ్రెడ్‌ను అందులో పెట్టి దానిపై కిస్మిస్‌లు జల్లాలి. వేరొక బౌల్‌ తీసుకుని పాలు, గుడ్డు సొ న, వెనిల్లా ఎస్సె న్స్‌, పంచదార, దాల్చిన పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిని కిస్మిస్‌ల మీద పోసి దాదాపు 55 నిమిషాల పాటు బేక్‌ చేయాలి. దాని మధ్యలో పుల్లతో పొడిచి చూస్తే ఏమీ అంటుకోకుండా వస్తే పుడ్డింగ్‌ తయారైనట్టే.