బ్రెడ్ ఉప్మా
 • 516 Views

బ్రెడ్ ఉప్మా

కావలసినవి:

 • హోల్ వీట్ బ్రెడ్ స్లైస్‌లు - 4,
 • ఉల్లిపాయ - 1 (తరగాలి),
 • టొమాటో - 1 (తరగాలి),
 • క్యారట్ తరుగు - టీ స్పూన్
 • పచ్చిబఠానీలు - టీ స్పూన్,
 • కరివేపాకు - రెమ్మ,
 • ఎండుమిర్చి - 2 (విరవాలి),
 • జీలకర్ర, ఆవాలు - అర టీ స్పూన్
 • శనగపప్పు - అర టీ స్పూన్,
 • ఇంగువ - చిటికెడు
 • పసుపు - చిటికెడు,
 • ఉప్పు - తగినంత
 • కొత్తిమీర తరుగు - టీ స్పూన్
 • నూనె - తగినంత

విధానం:

బ్రెడ్ స్లైస్‌లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టౌ పై కడాయి పెట్టి, నూనె వేడెక్కనివ్వాలి. అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, క్యారట్, పచ్చిబఠాణీలు, టొమాటో, ఉల్లిపాయలు, పసుపు, ఇంగువ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ, కలుపుతూ వేగనివ్వాలి. కూరగాయలు ఉడికాక, ఉప్పు కలపాలి. అందులో బ్రెడ్ ముక్కలను వేసి కలుపుతూ మరికొద్ది సేపు ఉంచాలి. చివరగా కొత్తిమీర చల్లి దించాలి. బ్రెడ్‌ను గ్రైండ్ చేసి కూడా ఉప్మా చేసుకోవచ్చు.