బూస్టీ
  • 809 Views

బూస్టీ

కావలసినవి:

  • మైదా: 1/2 kg
  • డాల్డా: 250 grms
  • పంచదార: 1/2 kg
  • బూస్ట్: 50 grms
  • పాలు: 1/2 ltr
  • యాలకుల పొడి: 1tsp
  • ఉప్పు: 1/4 tsp
  • అమ్మోనియం బై కార్బొనేట్: 1/2 tsp
  • సోడా: 1/2 tsp

విధానం:

1. మొదటగా డాల్డా, పంచదార పొడి, బూస్ట్ కలిపి క్రీమ్ లా చేయాలి. వీటికి మైదా, పాలు, యాలకుల పొడి, అమ్మోనియం బై కార్బోనేట్, సోడా, ఉప్పు చేర్చి ముద్దలా కలిపి కాసేపు గాటి చొరబడకుండా మూత పెట్టి ఉంచాలి.


2. అరగంట తర్వాత పిండిని తీసుకొని చపాతీలా అరంగుళం మందంగా చేసి పలుచటి స్టీలు చాకుతో కావలసిన ఆకారంలో కట్ చేసి నెయ్యిరాసిన ప్లాస్టిక్ ట్రేలో ఉంచి ఒవెన్ లో 15 నిమిషాల పాటు 300 డిగ్రీల ఫారన్ హీట్ వద్ద బేక్ చేయాలి.


(ఒవెన్ లేకపోతే కుక్కర్ లో గానీ, మూత ఉన్న మంద పాటి పాత్రలో గానీ ఇసుక పోసి స్టౌ మీద పెట్టి పదినిమిషాలు ఉంచాలి. కుక్కర్ లో పెట్టేటట్లైతే గాస్ కట్ తీసేయాలి) ఇసుక వేడెక్కిన తర్వాత బిస్కెట్స్ ప్లేట్ పెట్టాలి. ప్లేట్ మందంగా లోతుగా ఉండేటట్లు చూసుకోవాలి. పది నిమిషాల తర్వాత తీసి చూస్తే బూస్టీ టేస్టీ బిస్కెట్స్ రెడీ.