వెన్న కేక్
 • 506 Views

వెన్న కేక్

కావలసినవి:

 • కావలసిన పదార్థాలు..వెన్న - అర కప్పు
 • చక్కెర - ఒకటిన్నర కప్పు
 • గుడ్లు - 6
 • బ్రాందీ - నాలుగు టేబుల్‌ స్పూన్లు
 • తొక్కతీసి కట్‌ చేసిన ఆరెంజ్‌ పండ్లు - 2
 • కేక్‌ పౌడర్‌ - నాలుగు కప్పులు
 • అల్యూమీనియం పేపర్‌ - చిన్నది
 • పాలు - పావు కప్పు
 • చక్కెర పొడి - ఒక కప్పు
 • కొబ్బరి తురుగు - ఇష్టం వుంటే

విధానం:

పదార్థాలన్నీ గది ఉష్ణోగ్రత వద్ద వుండేలా చూసుకోవాలి. తరు వాత ఒక గిన్నెలో వెన్న వేసుకుని బాగా మిక్స్‌ చేయాలి. చక్కెర, గుడ్లు కూడా బాగా వేసి కలుపు కోవాలి. అందులో ఆరెంజ్‌ ము క్కలు కూడా వేసి బాగా కలపా లి. ఇందులో పాలు, పిండి నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలి. మిగిలిప పదార్థాలు కూడా వేసు కుని కలుపుకోవాలి. తరువాత మిశ్రమాన్ని మరీ మందంగా లేదా మరీ పలుచగా గాకుండా కేక్‌ పాన్‌లో వేసుకోవాలి. మిశ్ర మాన్ని వేసుకునే ముందు దానిపై కొద్దిగా వెజిటెబుల్‌ ఆయిల్‌ని రాయాలి. దీన్ని ఓవెన్‌లో పెట్టుకోవాలి. 45 నిమి షాల పాటు ఓవెన్‌లో 350 ఫార న్‌ీహ ట్‌ వద్ద వుంచాలి. ఎంతో రుచిగా వుండే కేక్‌ రెడీ... దీనిపై క్రీమ్‌తో డెకరేషన్‌ చేసుకోవాలి. దానిపై చెర్రీస్‌ అమరిస్తే మరింత బాగుంటుంది.