కుక్కడ్ దే మఖానీ
 • 431 Views

కుక్కడ్ దే మఖానీ

కావలసినవి:

 • చికెన్ ముక్కలు - 800 గ్రా,
 • కాశ్మీరీ చిల్లీపౌడర్ - 50 గ్రా,
 • ఉప్పు - తగినంత,
 • నిమ్మరసం - ఒక కాయది,
 • పెరుగు - కప్పు
 • అల్లం పేస్టు - 50 గ్రా,
 • వెల్లుల్లి పేస్టు - 50 గ్రా,
 • గరం మసాలాపౌడర్ - 30 గ్రా,
 • ఆవనూనె - 30 గ్రా,
 • వెన్న - 50 గ్రా, టొమాటో ప్యూరీ - 400 గ్రా
 • పచ్చిమిర్చి - 5,
 • కసూరి మేథీ పౌడర్ - 10 గ్రా
 • ఫ్రెష్ క్రీమ్ - 50 మి.లీ.
 • మిరప్పొడి - 50 గ్రా,
 • జీడిపప్పు - 100 గ్రా
 • బాదంపప్పు - 50గ్రా,
 • పంచదార - 10 గ్రా,
 • నూనె - 50 మి.లీ.
 • కొత్తిమీర - కట్ట,
 • ఉల్లిపాయలు - 100 గ్రా

విధానం:

చికెన్ ముక్కలకు పెరుగు, ఉప్పు, మిరప్పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆవనూనె వేసి బాగా కలిపి అరగంట సేపు పక్కన ఉంచాలి. పెనంలో వెన్న వేసి పెరుగు మిశ్రమంలో నానిన చికెన్ ముక్కలను దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఒక పాత్రలో కొద్దిగా నీరు పోసి జీడిపప్పు, బాదంపప్పులను ఉడికించి పేస్టు చేయాలి. మరొక పాన్‌లో కొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. ఆ మిశ్రమం బాగా వేగిన తర్వాత టొమాటో ప్యూరీ, కాశ్మీరీ చిల్లీపౌడర్, ఉప్పు, మిరప్పొడి, గరం మసాలా పౌడర్, కసూరి మేథీ పౌడర్ వేసి బాగా కలిపి కొద్దిగా నీటిని పోసి ఉడికించాలి. ఇవి ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత జీడిపప్పు, బాదంపప్పు పేస్టు వేసి ఉడికించాలి. చివరగా రోస్ట్ చేసిన చికెన్ ముక్కలన, పైన కొద్దిగా వెన్న వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత పైన ఫ్రెష్‌క్రీమ్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.