బటర్‌ నాన్‌
  • 649 Views

బటర్‌ నాన్‌

కావలసినవి:

  • గోధుమపిండి - అరకేజీ
  • ఉప్పు - సరిపడా,
  • పంచదార - 2 టేబుల్‌ స్పూన్లు
  • బేకింగ్‌ పౌడర్‌ - 1 టేబుల్‌ స్పూన్‌
  • బటర్‌ - 1 కప్పు

విధానం:

గోధుమపిండిలో ఉప్పు, పంచదార, బేకింగ్‌ పౌడర్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి బాగా కలపాలి. అందులో నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనిపై తడిబట్ట కప్పి అరగంట సేపు నాననివ్వాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా వత్తాలి. పెనంపై సన్నటి మంటపై గానీ, ఓవెన్‌లో గానీ వీటిని కాల్చుకోవాలి. పెనంపై కాల్చేటప్పుడు రోటీని చేత్తో మరింత వెడల్పుగా లాగి మడతలు పెడితే బావుంటుంది. కాల్చిన వెంటనే దానిపై వెన్న పూస్తే చాలు.