బటర్‌ ఇడ్లీలు
  • 526 Views

బటర్‌ ఇడ్లీలు

కావలసినవి:

  • ఇన్‌స్టంట్‌ ఇడ్లీమిక్స్... పావు కేజీ
  • గిలకొట్టిన తాజా పెరుగు... పావు కేజీ
  • మంచినీళ్లు... ఒకటిన్నర కప్పు
  • కొత్తిమీర తురుము... ముప్పావు కప్పు
  • వెన్న... వంద గ్రా.
  • జీడిపప్పు... తగినన్ని

విధానం:

ఇన్‌స్టంట్‌ ఇడ్లీమిక్స్‌లో పెరుగు, నీళ్లు, కొత్తిమీర తురుము, వెన్న వేసి కలిపి ఐదు నిమిషాలు నానబెట్టాలి. ఇడ్లీ ప్లేటుకు నూనె లేదా నెయ్యి రాసి ఇడ్లీ మిశ్రమాన్ని వేయాలి. ఒక్కో దానిమీద ఒక్కో జీడిపప్పు ఉంచి 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించి తీయాలి. అంతే వేడి వేడి ఇన్‌స్టంట్‌ బటర్‌ ఇడ్లీలు తయారైనట్లే...! వీటిని కొబ్బరి లేదా గ్రీన్ చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.