క్యాబేజీ కట్‌లెట్స్‌
 • 465 Views

క్యాబేజీ కట్‌లెట్స్‌

కావలసినవి:

 • క్యాబేజీ - అర కిలో,
 • ఉల్లిపాయలు - 2,
 • పచ్చిమిర్చి - 5
 • బంగాళ దుంపలు - పావు కిలో,
 • కోడిగుడ్డు - 1
 • జీడిపప్పు - 50 గ్రాములు,
 • కొత్తిమీర - 1 కట్ట,
 • ఉప్పు - తగినంత
 • నూనె- వేయించటానికి సరిపడా,
 • లవంగాలు - 10,
 • కారం - కొంచెం

విధానం:

క్యాబేజీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉడికించి మెత్తగా చేసుకోవాలి. బాండీలో నూనె వేసి తరిగిన ముక్కలను విడివిడిగా వేయించుకోవాలి. జీడిపప్పు ముక్కలు కూడా వేయించాలి. పైవన్నీ కలిపి కొద్దిగా ఉప్పు, కారం వేసి పెట్టుకోవాలి. కోడుగుడ్డు సొన తీసి ఒక గిన్నెలో వేసి నురగ వచ్చేవరకు చిలక్కొట్టాలి. బంగాళదుంప ముద్దలో వేయించి పెట్టుకున్న ముక్కలను కలిపి చిన్నచిన్న వడల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాటిని కోడిగుడ్డు సొనలో ముంచి కాగిన నూనెలో వేయించాలి.