క్యాబేజీ చట్నీ
  • 338 Views

క్యాబేజీ చట్నీ

కావలసినవి:

  • క్యాబేజీ-సగభాగం,
  •  వేరుశెనగ పప్పు-పావు కప్పు,
  • ఎండు మిరపకాయలు-3,
  • మినప్పప్పు-1 చెంచా,
  • సెనగపప్పు-1చెంచా,
  • ఇంగువ-అర చెంచా,
  • ఉప్పు-తగినంత,
  • నూనె-కొంచెం,
  • ఆవాలు-అర చెంచా,
  • కరివేపాకు-కొంచెం

విధానం:

రెండు లేదా మూడు చెంచాల నూనెని వేడి చేసి వేరుశెనగపప్పు, ఎండు మిర్చి వేయాలి. తర్వాత క్యాబేజీ తురుము వేసి పొడిగా అయ్యే వరకూ వేయించాలి. వీటిని చల్లార్చి కొద్దిగా నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బాణలిలో మరో రెండు చెంచాల నూనె వేసి అందులో ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించాలి. అది వేగాక గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మిశ్రమానికి జోడించాలి. చివరగా ఉప్పు, ఇంగువ వేసి ఐదు నిమిషాల తర్వాత దించుకోవాలి. ఇది అన్నం, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది.