కోవా కొవ్వొత్తులు
  • 308 Views

కోవా కొవ్వొత్తులు

కావలసినవి:

  • పాలు - 2 కప్పులు
  • పంచదార - 2 కప్పులు
  • మొక్కజొన్న పిండి - అరకప్పు
  • మైదాపిండి - అరకప్పు
  • బియ్యం పిండి - అరకప్పు
  • జీడిపప్పు ముద్ద - పావుకప్పు
  • నెయ్యి - అరకప్పు
  • యాలకుల పొడి - 1 స్పూన్‌
  • మిఠాయి రంగులు - రెండు /మూడు

విధానం:

బాండీలో పచ్చిపాలు, పంచదార, మైదా, బియ్యంపిండి, మొక్కజొన్న పిండి కలపాలి. సన్నసెగమీద ఉడికిస్తూ మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి. ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు జీడిపప్పు ముద్ద, యాలకుల పొడి కలపాలి. ఈ మిశ్రమానికి రెండు మూడు రంగులు వేయాలనుకుంటే భాగాలుగా చేసి ఒక్కో భాగానికి ఇష్టమైన రంగులు వచేసుకుని కొవ్వొత్తి ఆకారంలో చేసుకోవచ్చు.