క్యాప్సికమ్ బజ్జీ
  • 126 Views

క్యాప్సికమ్ బజ్జీ

కావలసినవి:

  • క్యాప్సికమ్ : 15 (చిన్నవి);
  • సెనగ పిండి : కప్పు;
  • ఉప్పు : తగినంత;
  • నీళ్లు : తగినన్ని;
  • నూనె : డీప్ ఫ్రైకి సరిపడా

క్యాప్సికమ్ బజ్జీ ఫిల్లింగ్ కోసం:

  • బంగాళ దుంపలు :పావు కిలో (ఉడికించి తొక్క తీసి, మెత్తగా చేయాలి);
  • ఉప్పు : తగినంత;
  • కారం : టీ స్పూను;
  • ఆమ్‌చూర్ పొడి : 2 టీ స్పూన్లు;
  • ధనియాల పొడి : 2 టీ స్పూన్లు;
  • ఇంగువ : పావు టీ స్పూను;
  • సోంపు : 2 టీస్పూన్లు;
  • పచ్చి మిర్చి : 4 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి)

విధానం:

ఒక పాత్రలో బంగాళదుంపల ముద్ద, ఉప్పు, కారం, ఆమ్‌చూర్ పొడి, ధనియాల పొడి, ఇంగువ, సోంపు, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలపాలి.


బజ్జీ కోసం:  

ఒక పాత్రలో సెనగ పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి బజ్జీల పిండిలా కలిపి పక్కన ఉంచాలి  కాప్సికమ్‌ను ఒకవైపు కొద్దిగా కట్‌చేసి గింజలు తీసేసి, బంగాళదుంపల మిశ్రమం క్యాప్సికమ్‌లో స్టఫ్ చేసి పక్కన ఉంచాలి  బాణలిలో నూనె వేసి కాగాక, ఒక్కో క్యాప్సికమ్‌ను సెనగ పిండిలో ముంచి బజ్జీల మాదిరిగా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి, వేడివేడిగా అందించాలి