క్యాప్సికమ్ పలావ్
  • 338 Views

క్యాప్సికమ్ పలావ్

కావలసినవి:

  • క్యాప్సికమ్.. ఎనిమిది
  • జీలకర్ర.. అర టీ.
  • నెయ్యి.. 3 టీ.
  • లవంగాలు.. 4 టీ.
  • ఉప్పు.. సరిపడా
  • బియ్యం.. అర కేజీ
  • చక్కెర.. ఒక టీ.
  • దాల్చిన చెక్క.. చిన్న ముక్క
  • మిరియాలు.. ఆరు
  • ఉల్లిపాయ.. ఒకటి
  • జీడిపప్పులు.. కాసిన్ని

విధానం:

క్యాప్సికమ్‌లను కొద్దిగా నీరుపోసి ఉప్పు, పంచదారతో కలిపి ఉడికించి ఉంచాలి. పాన్‌లో నెయ్యి వేసి, వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వేసి వేయించాలి. ఆపై అందులోనే కడిగి ఉంచుకున్న బియ్యం వేసి తగినన్ని నీళ్లుపోసి కలియబెట్టి ఉడికించాలి. అన్నం ఉడుకుతుండగా మధ్యలో ఉడికించిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసి, పైన మళ్లీ ఉడుకుతున్న అన్నంతోనే కవర్ చేసి.. సన్నటి సెగమీద ఉడికించాలి. అన్నం బాగా ఉడికిన తరువాత దించేసి.. పైన సన్నగా తరిగిన కొత్తిమీర, వేయించిన జీడిపప్పులతో అలంకరిస్తే.. నోరూరిస్తూ, మంచి రుచిగా ఉండే క్యాప్సికమ్ పలావ్ తయారైనట్లే..!