క్యారమెల్‌ పుడ్డింగ్‌
  • 488 Views

క్యారమెల్‌ పుడ్డింగ్‌

కావలసినవి:

  • గుడ్లు - 3,
  • పాలు - పావులీటరు
  • పంచదార - 100 గ్రా,
  • వెనిల్లా ఎసెన్స్‌ - 2 టీస్పూన్లు

విధానం:

మూడు టేబుల్‌ స్పూన్ల పంచదార, కొద్దిగా నీరు మందపాటి గిన్నెలో వేసి మరగనివ్వాలి. అప్పుడు అది తేనెలా తయారవుతుంది. మరో గిన్నెలో మిగిలిన పంచదార, గుడ్ల సొనను కలిపి బాగా గిలక్కొట్టాలి. అందులో పాలు, వెనిల్లా ఎసెన్స్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసిపెట్టుకున్న పంచదార పాకంలోవేసి అల్యూమినియం ఫాయిల్‌తో మూసి వేయాలి. దాన్ని ఆవిరి మీద ఉడించాలి. చల్లారిన తర్వాత ఓ ప్లేటులో బోర్లించాలి. అంతే నోరూరించే పుడ్డింగ్‌ రెడీ.