క్యారట్ భక్ష్యాలు
  • 774 Views

క్యారట్ భక్ష్యాలు

కావలసినవి:

  • క్యారట్ తురుము - కప్పు
  • బొంబాయిరవ్వ - కప్పు
  • నెయ్యి - పావు కప్పు
  • పంచదార - ఒకటింపావు కప్పు
  • మైదా - ఒకటింపావు కప్పు,
  • ఏలకుల పొడి - చిటికెడు

విధానం:

కడాయిలో నెయ్యి వేసి, కరిగాక, అందులో రవ్వ, క్యారట్ తురుము వేసి వేయించాలి. వేగిన తర్వాత, దాంట్లో పంచదార వేసి ముద్దలా అయ్యేంతవరకు కలిపి, ఏలకుల పొడి వేసి, పక్కన పెట్టి చల్లారనివ్వాలి. మైదాను నీళ్లతో తడిపి, పూరీపిండిలా ముద్దలా కలుపుకోవాలి. పిండి ముద్దను కొద్దిగా తీసుకొని ఉండలా చేసి, వెడల్పుగా చేత్తో అదిమి, అందులో క్యారట్, రవ్వ ముద్దను పెట్టి, అన్నివైపులా మూయాలి. దీన్ని ఒక కవర్ మీద పెట్టి, చేత్తో పూరీ పరిమాణంలో ఒత్తి, పెనం మీద కొద్దిగా నెయ్యి వేసి, రెండువైపులా కాల్చి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి, భక్ష్యాలను వేడి వేడిగా వడ్డించాలి.