కారెట్‌, బీన్స్‌ సలాడ్‌
  • 473 Views

కారెట్‌, బీన్స్‌ సలాడ్‌

కావలసినవి:

  • తురిమిన కారెట్లు: 2 కప్పులు
  • మొలకెత్తిన బీన్స్‌: 1/2కప్పు
  • పంచదార: 1 టీస్పూన్‌
  • నిమ్మరసం: 1 టీస్పూన్‌
  • కొబ్బరి తురుము: 1 టేబుల్‌ స్పూన్‌
  • కొత్తిమీర: 1 టేబుల్‌ స్పూన్‌
  • సన్‌ఫ్లవర్‌ సీడ్‌ ఆయిల్‌: 1 టేబుల్‌ స్పూన్‌
  • మెంతులు: ఒక టీ స్పూన్‌
  • ఉప్పు: రుచికి సరిపడ

విధానం:

ఒక పెద్ద బౌల్‌ తీసుకొని అందు లో కారెట్‌ తురుము, మొలకెత్తిన బీన్స్‌, పంచదార, నిమ్మరసం, కొ బ్బరి తురుము, తరిగిన కొత్తిమీ ర అన్నీ వేయాలి. పొయ్యి మీద చిన్న బాణలి పెట్టుకొని ఒకమాది రి మంటపై నూనె వేడి చేయాలి. మెంతులను అం దులో వేసి బం గారు రంగు వచ్చేదాకా వేయిం చాలి. వేగిన మెం తులను కారె ట్లు వగైరాలు వేసి పెట్టుకున్న గిన్నెలో వేయాలి. దానిని ఒక గరిటతో కలిసేలా తిప్పాలి. తర్వాత ఉప్పు జల్లుకొని తినాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సలాడ్‌ను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే చాలా మంచిది.