క్యారట్ కేక్
 • 443 Views

క్యారట్ కేక్

కావలసినవి:

 • మైదా - రెండు కప్పులు
 • బేకింగ్ పౌడర్ - టీ స్పూను, వంటసోడా - పావు టీ స్పూను
 • ఉప్పు - చిటికెడు, దాల్చినచెక్కపొడి - అర టీ స్పూను
 • జాజికాయపొడి - చిటికెడు, వెన్న - కప్పు
 • పంచదారపొడి - కప్పు,
 • కండెన్స్‌డ్ మిల్క్ - అర టిన్ను (200 గ్రా.)
 • వెనిలా ఎసెన్స్ - అర టీ స్పూను
 • తురిమిన క్యారట్ - ఒకటిన్నర కప్పు
 • బాదం, జీడిపప్పు, ఆక్రోట్లు, కిస్‌మిస్ - అరకప్పు
 • పాలు - అర కప్పు

విధానం:

మైదా, బేకింగ్‌పౌడర్, సోడా, ఉప్పు, దాల్చినచెక్క, జాజికాయపొడి వేసి జల్లించాలి. వెన్న, పంచదారపొడి, కండెన్స్‌డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ వేసి నురగ వచ్చేలా గిలకొట్టాలి. ఇందులో జల్లించిన మైదా, తురిమిన క్యారట్, సన్నగా కట్ చేసిన డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి. పిండి గ ట్టిగా ఉంటే కొద్దిగా పాలు కలపాలి. కేక్ టిన్ను లోపల వెన్న రాసి మైదా వేసి మొత్తం అంటుకునేలా సర్దిన తరవాత కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి ముందే వేడి చేసుకున్న ఓవెన్‌లో 180 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 45 నిముషాలు బేక్ చేయాలి.  enjoy the taste of క్యారట్ కేక్