క్యారెట్‌ పాయసం
  • 342 Views

క్యారెట్‌ పాయసం

కావలసినవి:

  • క్యారెట్‌ - పావుకిలో
  • చిక్కని పాలు - 1 లీటరు
  • జీడిపప్పు - 100 గ్రాములు
  • పంచదార - పావుకిలో
  • యాలకుల పొడి - 1 స్పూన్‌

విధానం:

క్యారెట్‌ ముక్కలను మెత్తగా ఉడికించాలి. ఇందులో జీడిపప్పు కలిపి మెత్తగా మిక్సీ వేయాలి. పాలు మరగబెట్టాలి. అందులో క్యారెట్‌ మిశ్రమం, యాలకుల పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని సన్న సెగ మీద అడుగంటకుండా తిప్పుతుండాలి. పది నిమిషాల తర్వాత పంచదార వేస్తే చాలు క్యారెట్‌ పాయసం సిద్ధమైనట్లే. చూడ్డానికి బాదం పాలలా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు.