క్యారట్ రైతా
 • 184 Views

క్యారట్ రైతా

కావలసినవి:

 • క్యారట్ - రెండు
 • పచ్చికొబ్బరి - పెద్ద ముక్క,
 • పెరుగు - కప్పు (చిలకాలి),
 • పచ్చిమిర్చి - ఆరు,
 • అల్లం వెల్లుల్లి పేస్టు - అర టీ స్పూన్,
 • నువ్వులు, ధనియాలు - ఒక్కో స్పూన్ చొప్పున,
 • ఉప్పు - తగినంత


పోపు కోసం:

 • నూనె - టేబుల్ స్పూన్
 • ఆవాలు, జీలకర్ర మినప్పప్పు - పావు టీ స్పూన్ చొప్పున,
 • కొత్తిమీర - చిన్న కట్ట
 • కరివేపాకు - రెండు రెమ్మలు,
 • ఎండుమిర్చి - రెండు

విధానం:

పచ్చిమిర్చిని గాటు పెట్టి మరుగుతున్న నూనెలో వేయించి తీసి పక్కన పెట్టాలి. క్యారట్‌ను, కొబ్బరిని చిన్న ముక్కలుగా తరగాలి. ఆ ముక్కల్లో అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, ధనియాలు, నువ్వులు, వేయించిన పచ్చిమిర్చి వేసి అన్నింటినీ కలిపి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమంలో పెరుగు కలపాలి. పచ్చిమిర్చి వేయించగా మిగిలిన నూనెతో పోపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.