1. ముందుగా అన్నం వండి వేరే పాత్రలోకి తీసి చల్లారనివ్వాలి.
2. క్యాప్సికమ్, క్యారట్‌ను కడిగి చిన్న ముక్కలుగా తరిగి ఉడికించాలి. వీటిని కలిపి లేదా విడిగా ఉడికించుకోవచ్చు.
3. బఠాణిలలో చక్కెర వేసి ఉడికించాలి (చక్కెర వేసి ఉడికిస్తే బఠాణి రంగు ఆకర్షణీయంగా ఉంటుంది, రుచి పెరుగుతుంది. బఠాణీలకు స్వతహాగా ఉండే వెగటు వాసన పోతుంది).
4. టొమాటోను ముక్కలుగా తరగాలి.