పెసరపప్పును రెండు గంటల ముందు నానబెట్టాలి. నానిన పప్పును కొంచెం బరకగా రుబ్బుకుని కొంచెం ఉప్పు కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత రుబ్బిపెట్టుకున్న పెసరపిండిని చిన్న చిన్న పునుకులుగా వేసి వేయించుకోవాలి.
బియ్యం కడిగి అరగంటసేపు నానబెట్టాలి. గిన్నెలో డాల్డా వేసి వేడయిన తరువాత లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క నిలువుగా తరిగిన మిర్చి, ఉల్లిముక్కల్ని వేసి దోరగా వేయించాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా వేసి 2 నిమిషాల తరువాత గోంగూర వేయాలి.
వెడల్పాటి పాన్‌లో పాలు పొయ్యాలి. అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, ఉప్పు కలపాలి. ఈ పాలు సగం అయ్యేవరకు మరిగించాలి. ఇందులోనే చికెన్ ముక్కలు కూడా వేసి ఉడికించాలి.
ముందుగా మాసాన్ని శుభ్రంగా కడిగి కొద్ది గా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి ఆరబెటు కోవాలి.
ముందుగా చికెన్‌ని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్‌లో పైన మసాలా కోసం చెప్చిన దినుసులను, పచ్చికొబ్బరి వేసి రోస్ట్ చేసి వేడి తగ్గిన తరవాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ముందుగా బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. చుక్కకూరను శుభ్రంచేసి గ్రైండ్ చేయాలి. అన్నం వండడానికి ఉపయోగించే అడుగుమందంగా ఉన్న పాత్రను కాని, ప్రెషర్ పాన్‌ను కాని స్టవ్‌పై ఉంచి వేడెక్కిన తరువాత నూనె, నెయ్యి వేయాలి.
ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద మూకుడు ఉంచి నూనె కాగిన తర్వాత కొత్తిమీర వేయించి దానిలో జీలకర్ర , ఆవాలు, పచ్చి మిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, వేరుసెనగ గుళ్ళు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి.
బియ్యం పూర్తిగా ఉడకక ముందు పొడిపొడిగా ఉన్న సమయంలోనే తీసి, తగినంత ఉప్పు కలిపి ఉడకబెట్టుకోవాలి. అన్నంను ఓ పాత్రలో తీసుకుని ఆరబెట్టాలి. స్టవ్‌పై బాణలి పెట్టి, నూనె కాగబెట్టాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసి తాళింపులా చేయాలి.
మూడు కప్పుల నీటిలో బియ్యాన్ని గంటసేపు నానబెట్టాలి. నీరు వడకట్టాలి. రెండు టీ స్పూన్ల నీటిలో కుంకుమపువ్వును నానబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
వెడల్పాటి కుండ లేదా పాత్ర తీసుకుని చికెన్ మునిగేటన్ని నీల్లు పోసి మరిగించాలి. అందులో చికెన్, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. ఇలా చేయడం వల్ల అందులో అధికంగా ఉన్న కొవ్వు అంతా బయటికి పోతుంది.
బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి, ఒక నిముషం పాటు కలపాలి. మష్రూమ్స్, ఎల్లో క్యాప్సికమ్, పచ్చిబఠాణీ, ఉల్లికాడల తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చి,
బియ్యం కడిగి పది నిముషాలు నాననివ్వాలి. గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేయాలి. అందులో నిలువుగా చీలికల్లా తరిగిన ఉల్లిపాయ వేసి మెత్తబడే వరకు వేయించాలి.
ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండిలో కొంచెం నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత కోడి గుడ్ల సొన వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత క్యారెట్, బీన్స్, బఠాణీలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలి.