బాణలిలో నూనె లేకుండా శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, ఎండుకొబ్బరి తురుము, ఎండుమిర్చి, నువ్వులను దోరగా వేయించి పక్కనుంచుకోవాలి. చల్లారిన తరవాత అందులో మిరియాలు, జీలకర్ర, ఇంగువ వేసి గ్రైండర్‌లో మెత్తగా చేసి పక్కనుంచుకోవాలి.
క్యాలీఫ్లవర్ పువ్వులను వేడి నీళ్లలో ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. మొక్కజొన్న పిండి, మైదాపిండి, గుడ్డు, మిరియాలపొడి, ఉప్పు, ఫుడ్ కలర్, అజినమోటో అన్నీ ఒక పాత్రలో వేసి కలపాలి. క్యాలీఫ్లవర్ ముక్కలను ఆ మిశ్రమంలో వేసి కలపాలి.
ఈ సూప్ కోసం హైబ్రీడ్ టమాటాలు తీసుకోవాలి. గుజ్జు ఎక్కువగా ఉంటుంది. గ్లాసుడు నీళ్ళు పోసి టమాటాలను పది నిమిషాలు ఉడికించాలి. చల్లారాక ముక్కలు చేసి గ్రైండ్ చేయాలి.
క్యాబేజీ, క్యారెట్ ముక్కలు, ఉప్పు కలిపి కొద్దిసేపు ఉంచాలి. ఈ ముక్కలకి కార్న్‌ఫ్లోర్, మైదా, ఉప్పు చేర్చి గట్టిగా కలపాలి. అసరమైతే కొబ్బరి నీళ్లు కలపొచ్చు. ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి నూనెలో బంగారు రంగు వచ్చేదాక వేయించాలి.
ముందుగా నానబెట్టిన బియ్యంలో నాలుగు టేబుల్ స్పూన్లు విడిగా తీసుకుని మెత్తగా దోశపిండిలా గరిటెజారుగా రుబ్బుకోవాలి. ఈ పిండిని బాణలిలో వేసి పొయ్యిమీద పెట్టాలి.ఈ పిండిని బాణలిలో వేసి పొయ్యిమీద పెట్టాలి.
ముందుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చి మిర్చి ముక్కలు తరిగి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. అలానే శుభ్రంగా ఉన్న వస్త్రంలో దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు తీసుకొని మూటలా కట్టాలి.
బెండకాయలను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. స్టౌ మీద మందపాటి గిన్నెలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగాక బెండకాయముక్కలు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి, టొమాటో వేసి కలపాలి.
స్టౌ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత సెనగపప్పు, పల్లీలు, జీడిపప్పు వేయించాలి. తర్వాత ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత మిర్చి, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి.
ఉల్లిపాయలు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుమును మిక్సీలో తీసుకుని మెత్తగా మిశ్రమంలా చేసుకుని దాన్ని కొబ్బరిపాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో బియ్యప్పిండి, ముప్పావుకప్పు కొబ్బరి తురుమూ తీసుకుని బాగా కలిపి బాణలిలో వేయించుకోవాలి.
క్యాలీఫ్లవర్ ముక్కలను ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి. అందులో నీళ్లను పూర్తిగా వంపేయాలి. గిన్నెలో కార్న్‌ఫ్లోర్, మైదా, ఉప్పు, బేకింగ్ సోడా వేసి పకోడీపిండిలా కొంచెం జారుగా కలపాలి. బాండీలో నూనె పోసి బాగా కాగనివ్వాలి.
ఒక పాన్‌లో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, పచ్చి మిర్చి, కరివేపాకు, జీడిపప్పు, తరిగిన అల్లం వేసి వేగించాలి. అవి వేగిన తర్వాత పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలిపి మరిగించాలి.
వంకాయలను గుత్తి వంకాయ మాదిరిగా మధ్యలోకి కోసి ఉప్పునీటిలో వేయాలి. ఓ బాణలిలో కొద్దిగా నూనె పోసి మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు వేసి దోరగా వేయించాలి. వీటిని మిక్సీలో వేసి గరుకుపొడిలా చేయాలి.
ముందుగ చింతపండు నుండి రసం తీసి చింతపండు నీళ్ళు తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్ళల్లో వంకాయలు, చిటికెడు పసుపు, ఉప్పు వేసి ఉడక పెట్టుకోవాలి. ఒక పాన్ లో కొంచం నూనె పోసి కాగాక ఆవాలు, మినపప్పు, మెంతులు వేయించి.
శనగలను ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీరంతా తీసేసి కుకర్‌లో సుమారు అరగంటసేపు ఉడికించాలి. బాణలిలో కాగాక బిరియానీ ఆకు, గరం మసాలా వేసి వేగాక, ఉల్లి తరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.