క్యాలీఫ్లవర్ బిరియానీ
 • 288 Views

క్యాలీఫ్లవర్ బిరియానీ

కావలసినవి:

 • బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పులు
 • నీరు - మూడు కప్పులు
 • ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి - ఈ రెండిటినీ మెత్తగా పేస్ట్ చేయాలి
 • టొమాటో గుజ్జు - అర కప్పు
 • పచ్చిబఠాణీ - గుప్పెడు
 • మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ - 1
 • నెయ్యి లేదా నూనె - టేబుల్ స్పూన్
 • ఉప్పు - తగినంత
 • కొత్తిమీర - కొద్దిగా


మసాలాకోసం

 • జీలకర్ర - అర టీ స్పూను
 • ధనియాల పొడి లేదా
 • ఏలకులపొడి - టీ స్పూను
 • పసుపు - చిటికెడు
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను
 • బిరియానీ మసాలా - టేబుల్ స్పూను

విధానం:

మూడు కప్పుల నీటిలో బాస్మతి బియ్యాన్ని ఉడికించాలి. ఉడుకుతుండగా కొద్దిగా ఉప్పు వేసి ఉడికిన అన్నాన్ని పక్కన ఉంచుకోవాలి. బాణలిలో కొద్దిగా నెయ్యి వేడిచేసి అందులో ఉల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ను వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తరవాత మసాలాదినుసులు వేసి, ఘుమ ఘుమలాడే వాసన వచ్చేవరకు వేయించాలి. తరవాత టొమాటో గుజ్జు, పచ్చిబఠాణీ, క్యాలీఫ్లవర్ తరుగు వేసి కలపాలి. ఈ పదార్థాలన్నీ మెత్తబడేవరకు చిన్న మంట మీద ఉడికించాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీరు చిలకరించాలి. తరవాత ఉడికించుకున్న అన్నంలో ఈ పదార్థాలను కలపాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.