పాలక్ రైస్
  • 335 Views

పాలక్ రైస్

కావలసినవి:

  • సోనామసూరి బియ్యం- 100 గ్రా,
  • ఆవాలు - టీ స్పూన్,
  • మినప్పప్పు - టీ స్పూన్,
  • శనగపప్పు- టీ స్పూన్,
  • పచ్చిమిర్చి - ఆరు,
  • తాజా పాలకూర- 400 గ్రా (శుభ్రం చేసి సన్నగా తరగాలి),
  • కరివేపాకు - 50 గ్రా ,
  • నెయ్యి - 50 గ్రా,
  • నిమ్మచెక్క - ఒకటి
  • ఉప్పు - తగినంత

విధానం:

అన్నం వండి వెడల్పు పాత్రలో వేసి చల్లారనివ్వాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి కొంత కరివేపాకును నేతిలో వేయించి పక్కన ఉంచాలి. మిగిలిన నేతిలో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, మిగిలిన కరివేపాకు వేయించాలి. తర్వాత తరిగిన పాలకూర వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో అన్నం, నిమ్మరసం కలిపి, నేతిలో వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేయాలి.