చమ్ - చమ్
  • 333 Views

చమ్ - చమ్

కావలసినవి:

  • ఆవుపాలు - లీటరు
  • వెనిగర్ - 10గ్రా.,
  • పంచదార - అరకేజీ, పావుకేజీ విడివిడిగా
  • గేదె పాలు - అర లీటరు
  • వంటసోడా - 5 గ్రా.,
  • పిస్తా - 50 గ్రా.
  • జీడిపప్పు - 50 గ్రా.,
  • చెర్రీలు - 6

విధానం:

ముందుగా ఆవుపాలను బాగా వేడి చేసి పక్కనుంచుకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా నీరు, వెనిగర్ వేసి బాగా కలుపుకుని దానిని వేడి పాలలో వేస్తే పాలు విరుగుతాయి. అప్పుడు విరుగులోని నీళ్లను పిండేసి మిగిలిన ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో అరకేజీ పంచదార, టీస్పూను నీరు పోసి కరిగించాలి. అందులో ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఉండల (చంచం) ను వేసి ఉడికించి వాటిని పక్కన పెట్టాలి. ఇంకొక బాణలి తీసుకుని అందులో గేదెపాలు పోసి మరిగిన తరవాత అందులో 250 గ్రా. పంచదార, వంటసోడా వేసి బాగా కలపాలి. అది మొత్తం కోవాలా తయారయిన తరువాత మంట మీద నుంచి కిందకు దింపి చల్లార్చాలి. ముందుగా తయారుచేసుకున్న చమ్-చమ్‌ల మీద ఈ మిశ్రమాన్ని వేసి, పైన పిస్తా, జీడిపప్పు, చెర్రీలతో గార్నిష్ చే సి సర్వ్ చేయాలి. అంతే స్వీట్ చమ్ - చమ్ రెడీ