చట్‌పటా ముర్గ్
  • 335 Views

చట్‌పటా ముర్గ్

కావలసినవి:

  • చికెన్ బ్రెస్ట్ పీస్-200 గ్రా,
  • శనగపిండి-10 గ్రా,
  • బియ్యంపిండి-5 గ్రా
  • ఉప్పు-తగినంత,
  • కారం-టీ స్పూన్,
  • పెరుగు-పావు కప్పు,
  • ఉల్లిపాయ తరుగు-పావు కప్పు,
  • టొమాటో ముక్కలు-పావు కప్పు,
  • ధనియాల పొడి-2 టీ స్పూన్లు,
  • పసుపు-చిటికెడు,
  • కొత్తిమీర-కట్ట,
  • జీలకర్ర-అర టీ స్పూన్,
  • వెల్లుల్లి-4 గ్రా (సన్నగా తరగాలి),
  • కరివేపాకు-రెమ్మ,
  • అల్లం-3 గ్రా (సన్నగా తరగాలి),
  • నూనె-50 గ్రా
  • పచ్చిమిర్చి-ఆరు (నిలువుగా చీరాలి)

విధానం:

ముందుగా చికెన్ పీసెస్‌ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్‌లో శనగపిండి, బియ్యంపిండి వేసి కాస్త నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసి కాగాక పైన కలుపుకున్న మిశ్రమంలో చికెన్ ముక్కలను ముంచి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం పక్కన ఒక పాన్‌లో కాస్త నూనె వేసి వేడెక్కాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి ముక్కలను వేయాలి. ఇవి వేగుతూ ఉండగా అందులో ఉల్లిపాయ తరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి అందులో టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ సెగ మీద పెట్టి చివరగా చిలికిన పెరుగు, కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని కూడా వేసి కలిపి వెంటనే బౌల్‌లోకి తీసుకోవాలి. కలర్‌ఫుల్‌గా ఇష్టపడేవాళ్లు ఎరుపు రంగు ఫుడ్ కలర్‌ని వేసుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది. చట్‌పటా ముర్గ్‌ను స్టార్టర్స్‌లా లేదా స్నాక్స్‌లా ఇష్టపడతారు.