చెగోడీలు
  • 510 Views

చెగోడీలు

కావలసినవి:

  • బియ్యం పిండి - 3 డబ్బాలు
  • మైదాపిండి - 1 డబ్బా
  • నెయ్యి - 50 గ్రాములు
  • వాము - అరస్పూను,
  •  కారం - 1 స్పూను
  • నూనె - వేయించడానికి సరిపడా
  • ఉప్పు - సరిపడా,
  • నీళ్లు - 4 డబ్బాలు

విధానం:

నాలుగు డబ్బాల నీళ్లలో ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు స్టౌమీద నుండి దించి అందులో వాము, కారం, బియ్యంపిండి, మైదా, నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు అలాగే ఉంచాలి. చల్లారాక బాగా కలిపి ముద్ద చేయాలి. దీన్ని చిన్న చిన్న ఉండలు తీసుకుని తాడులా చేసి గుండ్రంగా చుట్టాలి. వీటిని కాగిన నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.