ముందుగా చికెన్ ముక్కలు మిక్సీలో వేసి బాగా మెత్తగా కైమాలా చేసుకోవాలి. తరువాత సిద్ధం చేసి ఉంచుకున్న అల్లం, ఉల్లి, పచ్చి మిరపకాయల మిశ్రమాన్ని కైమాకు దట్టించి బాగా కలపాలి. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలు గా చేసి ఆవిరిపై ఉడికించాలి. ఉడికిన తరువాత ఆ బాల్స్ పైన సూప్ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.