చికెన్ కర్రీ
  • 263 Views

చికెన్ కర్రీ

కావలసినవి:

  • మాంసం : 250 గ్రా
  • ఉల్లిపాయలు: 2
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్‌: కొద్దిగా
  • పసుపు : 1/4
  • కారంపొడి : సరిపడినంతగా
  • మిరియాలపొడి: 1/2 స్పూన్‌
  • కొబ్బరి పొడి: 2 స్పూన్లు
  • గరం మసాలా పొడి: 1/4 స్పూన్‌
  • ఉప్పు : 1/2
  • కరివేపాకు : 2 రెమ్మలు
  • నూనె : వేయించడానికి సరిపడా

విధానం:

ప్యాన్‌ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లి పాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇప్పుడు పసుపు,కరివేపాకు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, కారంపొడి వేసి కొద్దిగా వేపి కడిగి పెట్టు కున్న మాంసం ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి. నీరంతా ఇగిరిపో యాక ఆరకప్పు నీరు పోసి మూతపెట్టి నిదానం గా ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత కొబ్బ రిపొడి, మిరియాలపొడి వేసి మరో ఐదు నిమి షాలు ఉడికించి నూనె తేలాక గరం మసాలా వేసి దింపేయాలి. ఈ కూర అన్నంలోకి, చపాతీ ల్లోకి బావుంటుంది. కారం మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ, తక్కువ వేసుకోవచ్చు.