చికెన్ ఫ్రైడ్ ROLL
  • 336 Views

చికెన్ ఫ్రైడ్ ROLL

కావలసినవి:

  • చికెన్‌ : 100 గ్రా
  • మైదా పిండి : పావు కిలో
  • గుడ్డు : ఒకటి
  • క్యాబేజి : 25 గ్రా
  • బీన్స్‌ : 25 గ్రా
  • క్యారెట్‌ : 25 గ్రా
  • కారం : అర స్పూన్‌
  • నూనె : అర లీటర్‌
  • ఉల్లిపాయ : ఒకటి
  • కొత్తిమీర : రెండు రెమ్మలు
  • ఉప్పు : తగినంత.

విధానం:

ముందుగా మైదాను ఓ గిన్నెలో వేసి గుడ్డులోని తెల్లసొనను వేసి సరిపడ నీరును పోసి బాగా కలపాలి. చపాతీ పిండిలాగా మెత్తగా కలపాలి. దీన్ని తడిగుడ్డతో కప్పి అరగంట సేపు ఉంచాలి. ఇంతలో మసాలా సామాగ్రిని తయారు చేసుకోవాలి. చికెన్‌ను ఉడకబెట్టు కోవాలి. కూరలను, చికెన్‌ను సన్నని పొడు గాటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి ముక్కలు, బీన్స్‌, క్యాబేజి, క్యారెట్‌ ముక్కలు, కారం, ఉప్పులను వేసి చికెన్‌ ను ఒకటి తర్వాత ఒకటిగా వేసి వేయించి దించాలి. తర్వాత కలిపి పెట్టిన చపాతీ పిండిని తీసి వత్తి అందులో చికెన్‌ మసాలా మిశ్రమాన్ని పెట్టి మూసి రోల్స్‌లాగా చుట్టి పెట్టాలి. కాగిన నూనెలో ఎర్రగా వేయించి దించాలి.