చికెన్‌ ఇరానీ
  • 279 Views

చికెన్‌ ఇరానీ

కావలసినవి:

  • చికెన్‌ - అర కిలో,
  • టమాటాలు -పావు కిలో
  • ఉల్లిపాయలు -పావు కిలో,
  • అల్లంవెల్లుల్లి ముద్ద -20 గ్రాములు
  • నూనె - 2 స్పూన్లు,
  • పచ్చిమిర్చి ముద్ద - 2 స్పూన్లు
  • గుడ్లు -2,
  • కొత్తిమీర - 1 కట్ట,
  • దాల్చిన చెక్క - 2
  • వెన్న - 50 గ్రాములు,
  • బిర్యానీ ఆకులు - 2

విధానం:

చికెన్‌ ముక్కలు పెద్దగా కోసుకుని శుభ్రం చేసుకోవాలి. నూనెలో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేయించాలి. అందులోనే టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లిముద్ద, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి ముద్ద, చికెన్‌ ముక్కలు వేసి అరగంట ఉడకనివ్వాలి. కొద్దిగా నీళ్లుపోసి మధ్య మధ్యలో కలుపుతూ సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. తర్వాత గుడ్లు పగులగొట్టి ఒక పాత్రలో వేసి బాగా గిలక్కొట్టి ఉడుకుతున్న కూరలో కలపాలి. గుడ్లు కూడా ఉడికిన తర్వాత దానిపై వెన్న వేసి స్టౌమీద నుండి దించి కొత్తిమీర చల్లుకోవాలి.