చికెన్‌ కడాయి
 • 559 Views

చికెన్‌ కడాయి

కావలసినవి:

 • చికెన్.. ఒకటిన్నర కేజీ
 • ఉల్లిపాయలు.. ఒక కేజీ
 • టొమోటోలు.. అర కేజీ
 • నెయ్యి.. 300 గ్రా.
 • కారం.. 20 గ్రా.
 • పచ్చిమిర్చి.. 8
 • లవంగాలు.. 4
 • కరివేపాకు.. 15
 • కొత్తిమీర.. ఒక కట్ట
 • అల్లం వెల్లుల్లి పేస్ట్.. 2 టీ.
 • ఉప్పు.. తగినంత

విధానం:

కడాయిలో నెయ్యి వేడిచేశాక.. అందులో మెత్తగా నూరిన ఉల్లిపాయల ముద్దను వేసి, దోరగా పది నిముషాలు వేయించాలి. అందులోనే టొమోటో ముక్కలు, కారం, పచ్చిమిర్చి, ఉప్పు కలపాలి. లవంగాలను కొద్దిగా చితకకొట్టి అందులో కలిపాలి. అల్లం వెల్లుల్లి వేసి బాగా వేయించిన తరువాత చికెన్‌ ముక్కల్ని వేసి బాగా కలియబెట్టాలి. కూర సగం ఉడికిన తరువాత కరివేపాకు, కొత్తిమీర చల్లి మూతపెట్టాలి. సన్నని మంటమీద చక్కగా మగ్గబెట్టి అన్నంలోగాని రొట్టెలతో కానీ సర్వ్ చేస్తే భలే రుచిగా ఉంటుంది.