చికెన్ పెరిపెరి
 • 325 Views

చికెన్ పెరిపెరి

కావలసినవి:

 • చికెన్- 500గ్రా
 • మిరియాలు -అర టీస్పూన్
 • ఎండు మిర్చి - 20 గ్రా
 • అల్లం వెల్లుల్లి -ఒకటిన్నర టీ స్పూన్
 • జీలకర్ర -అర టీ స్పూన్
 • వెనిగర్ -అర కప్పు
 • దాల్చిన చెక్క- 2గ్రా
 • లవంగాలు -2 గ్రా
 • ఉప్పు- తగినంత
 • నూనె- 60గ్రా

విధానం:

ఎండు మిర్చిని తుంచి అందులోని విత్తుల్ని తొలగించండి. ఈ ఎండు మిర్చి,మిరియాలు,జీలకర్ర ,లవంగాలు,దాల్చిన చెక్క- వెనిగర్ లో వేసి నానబెట్టండి.పిదప ఈ మిశ్రమాన్ని కాటుకలా మెత్తగా రుబ్బండి. చికెన్ ముక్కలకు అల్లంవెల్లుల్లి ,ఉప్పు,పట్టించి నానబెట్టండి.. బాణలి లో నూనె పోసి వేడి చేయండి. ఇందులో మసాలాముద్ద ను వేసి వేయించండి. నూనె పైకి తేలుతున్నప్పుడు చికెన్ ముక్కలు వేసి కలియబెట్టండి.బాగా ఉడికే వరకు కలపండి.ఆ పైన పొడి పొడి గా అయ్యే వరకు చికెన్ ను వేయించండి.ఇప్పుడు చికెన్ పెరి పెరి తినడానికి రెడీ.