1. వెడల్పాటి కుండ లేదా పాత్ర తీసుకుని చికెన్ మునిగేటన్ని నీల్లు పోసి మరిగించాలి. అందులో చికెన్, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. ఇలా చేయడం వల్ల అందులో అధికంగా ఉన్న కొవ్వు అంతా బయటికి పోతుంది.
2. తరువాత చికెన్ ను బయటికి తీసి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.
3. ఇప్పుడు రైస్ కుక్కర్ లో నూనెవేసి కాగాక అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి.
4. తరువాత కడిగిన బియ్యం, చికెన్ ముక్కలు, తగినన్ని నీళ్ళు పోసి ఉప్పు వేయాలి. చికెన్ ఉడికించి తీసిన నీళ్ళు కూడా పోయవచ్చు.
5. అన్నం ఉడికేలోగా సోయాసాస్ లో మిగిలిన దినుసులన్నీ వేసి కలపాలి. ఉడికించిన చికెన్ రైస్ ను కొతితమీరతో అలంకరించిన సాస్ తో వడ్డించాలి.