చికెన్ మునిగేంతవరకు నీళ్ళు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో నూనె వేడిచేసి క్యారెట్, బీన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగును వేసి రెండు నిమిషాలాగి చికెన్ ఉడికించిన నీళ్ళు, పంచదార, ఉప్పు, పాలకూర తరుగు, మిరియాల పొడి వేసి పదినిమిషాలు ఉడికించి స్టౌపైనుంచి దించేయాలి. చివరిగా అజినమోటో వేసి అతిథులకు వడ్డించండి.