చికెన్‌ విజామోర్‌
 • 547 Views

చికెన్‌ విజామోర్‌

కావలసినవి:

 • చికెన్‌ - అరకిలో
 • టమాటాలు - 4
 • ఎండుకొబ్బరి - 100 గ్రాములు
 • ధనియాలు - 4 టేబుల్‌ స్పూన్లు
 • ఉల్లిపాయలు - 3
 • జీలకర్ర - 3 టేబుల్‌ స్పూన్లు
 • ఎండు మిర్చి - 5
 • గరం మసాలా - 3 స్పూన్లు
 • అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 3 స్పూన్లు
 • నూనె - తగినంత
 • ఉప్పు - తగినంత
 • కరివేపాకు - 2 కట్టలు

విధానం:

చికెన్‌ కి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కలిపి సన్నమంట మీద ఉడికించాలి. కొబ్బరి, గసగసాలు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర ముద్దగా చేయాలి. బాండీలో నూనె వేసి ఉల్లి ముక్కలు, గరం మసాలా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉప్పు వేసి దోరగా వేయించాలి. అందులో టమాటా ముక్కలు, ఉడకబెట్టిన చికెన్‌ మిశ్రమాన్ని కలిపి ఉండికించాలి. చివరిలో కొబ్బరి, ధనియాలపొడి ముద్దను కలిపి దింపుకోవాలి.