చిల్లీ మష్రూమ్స్‌
  • 293 Views

చిల్లీ మష్రూమ్స్‌

కావలసినవి:

  • మష్రూమ్స్‌ (పుట్టగొడుగులు) - పావుకేజీ
  • నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు,
  • ఉల్లి కాడలు - 4
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 1 టేబుల్‌ స్పూన్‌
  • ఎండుమిర్చి - 4, ఉప్పు - తగినంత
  • టమాటా సాస్‌ - 1 టేబుల్‌ స్పూన్‌
  • పంచదార - 1 టీ స్పూన్‌,
  • చిల్లీ సాస్‌ - 1 టేబుల్‌ స్పూన్‌
  • సోయాసాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు

విధానం:

బాండీలో నూనె కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి. అది చిటపటలాడాక అందులోనే ఎండుమిర్చి వేసి వేయించాలి. పుట్టగొడుగులను వేసి ఐదు నిమిషాలు సన్న మంటపై వేయించాలి. తర్వాత టమాటా సాస్‌, సోయాసాస్‌, చిల్లీ సాస్‌, ఉప్పు, పంచదార వేసి కలియదిప్పాలి. ఇలా మరో ఐదు నిమిషాలు స్టౌమీద ఉంచి దింపేయాలి. దానిపై ఉల్లికాడ ముక్కలను చల్లితే చాలు. చిల్లీ మష్రూమ్స్‌ తయారైనట్లే.