చిల్లీ ప్రాన్స్
  • 461 Views

చిల్లీ ప్రాన్స్

కావలసినవి:

  • ప్రాన్స్ - 200 గ్రా
  • అజినమోటో - అర టీ స్పూన్
  • ఉప్పు - తగినంత
  • మిరియాలపొడి - టీ స్పూన్
  • కోడిగుడ్డు - ఒకటి
  • కార్న్‌ఫ్లోర్ - అర కప్పు
  • మైదాపిండి - పావు కప్పు
  • నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
  • పొడవుగా తరిగిన క్యాప్సికం - కప్పు
  • పొడవుగా తరిగిన ఉల్లిపాయ - కప్పు
  • పొడవుగా తరిగినపచ్చిమిర్చి - ఆరు
  • అల్లం వెల్లుల్లి తరుగు - నాలుగు టీ స్పూన్లు
  • చిల్లీ సాస్ - టీ స్పూన్
  • సోయా సాస్ - టీ స్పూన్
  • ఉల్లికాడలు - నాలుగు (సన్నగా తరగాలి)

విధానం:

ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో అజినమోటో, ఉప్పు, మిరియాలపొడి, కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో సగంసగం ఉడికించిన రొయ్యలను వేసి కలపాలి. పాన్‌లో నూనె వేడయ్యాక ప్రాన్స్‌ని పకోడీల్లా వేసి దోరగా వేయించాలి. వేరొక పాన్‌లో పావు కప్పు నూనె వేసి వేడయ్యాక క్యాప్సికం తరుగు, ఉల్లితరుగు, అల్లంవెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేయించాలి. అవి వేగాక అందులో రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, ఫ్రై చేసిన ప్రాన్స్, ఉల్లికాడలను కూడా కలిపి తక్కువ సెగమీద అయిదారు నిమిషాలు బాగా కలిపి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.