చైనా టౌన్ పులావ్
 • 508 Views

చైనా టౌన్ పులావ్

కావలసినవి:

 • బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు,
 • నూనె - 3 టీ స్పూన్లు,
 • మష్రూమ్స్ - 8 (ముక్కలు చేసుకోవాలి),
 • ఎల్లో క్యాప్సికమ్ - 1 (పొడవుగా తరగాలి)
 • అల్లంతురుము - టేబుల్ స్పూన్,
 •  వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్,
 • లవంగాలు - 2,
 • పచ్చి బఠాణీ - కప్పు,
 • ఉల్లికాడల తరుగు - అర కప్పు,
 • సోయా సాస్ - రెండు టేబుల్ స్పూన్లు,
 • నువ్వులనూనె - టీ స్పూను, బ్రకోలీ - కొద్దిగా,
 • టొమాటో చక్రాలు - నాలుగైదు,
 • బీన్స్ తరుగు - పావు కప్పు

విధానం:

బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి, ఒక నిముషం పాటు కలపాలి. మష్రూమ్స్, ఎల్లో క్యాప్సికమ్, పచ్చిబఠాణీ, ఉల్లికాడల తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చి, దగ్గర పడేవరకు సుమారు పది నిముషాలు కలపాలి.నానబెట్టిన బియ్యం, బఠాణీ, ఉల్లికాడల తరుగు, బీన్స్ తరుగు, సోయాసాస్, నువ్వులనూనె వేసి అన్నీ కలిపి ఉడికించాలి టొమాటో చక్రాలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.