చైనీస్‌ మటన్‌ బాల్స్‌
  • 117 Views

చైనీస్‌ మటన్‌ బాల్స్‌

కావలసినవి:

  • బోన్‌లెస్‌ మటన్‌ కీమా- అరకిలో
  • కోడిగుడ్లు-రెండు, సోయా సాస్‌-టేబుల్‌ స్పూను, పంచదార-టీ స్పూను
  • ఉప్పు-టీ స్పూను, పచ్చి మిర్చి-ఆరు
  • చైనీస్‌ క్యాబేజీ తురుము- అర కప్పు
  • మైదా పిండి-పావు కప్పు,
  • చైనీస్‌ సాల్ట్‌-పావు టీ స్పూను

విధానం:

కీమాను ఉడికించి ఉంచాలి. కోడిగుడ్ల సొనను బాగా గిలకొట్టాలి. అందులో సోయా సాస్‌, పంచదార వేసి బాగా కలపాలి. తరువాత ఉడికించిన కీమా, పచ్చిమిర్చి తురుము, క్యాబేజీ తురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉప్పు చైనీస్‌ సాల్ట్‌, మైదాపిండి వేసి కలిపి ఉండలుగా చేయాలి. బాణలిలో నూనె పోసి కాగాక ఈ ఉండల్ని వేసి వేయించి తీయాలి. వీటిల్లోకి కాస్త గ్రేవీ కావాలనుకుంటే విడిగా బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరువాత చిల్లీ సాస్‌, కొత్తిమీర తురుము వేసి అందులోమటన్‌ బాల్స్‌ కలిపి అందించాలి.