చింతచిగురు పచ్చడి
 • 585 Views

చింతచిగురు పచ్చడి

కావలసినవి:

 • పెరుగు - 200 గ్రా
 • కొబ్బరి తురుము - 100 గ్రా
 • ఉప్పు - తగినంత
 • పచ్చిశనగపప్పు- పది గ్రాములు
 • మినప్పప్పు - పది గ్రాములు
 • ఆవాలు - టీ స్పూన్
 • కరివేపాకు - రెండు రెమ్మలు
 • చింతచిగురు - 20 గ్రా
 • మిరప్పొడి - పది గ్రాములు
 • ఎండుమిర్చి - 5 గ్రా
 • నూనె - టీ స్పూన్

విధానం:

పెరుగులో ఉప్పు, కొబ్బరి తురుమును కలపాలి. పెనంలో నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వరుసగా వేసి వేగిన తర్వాత చివరగా చింతచిగురు, మిరప్పొడి వేయాలి. దీనిని పెరుగు మిశ్రమంలో కలపాలి.