చింతచిగురు మటన్ కూర
 • 743 Views

చింతచిగురు మటన్ కూర

కావలసినవి:

 • నూనె - టేబుల్ స్పూను;
 • ఆవాలు - టేబుల్ స్పూను;
 • జీలకర్ర -టేబుల్ స్పూను;
 • ఎండు మిర్చి - నాలుగు;
 • గరం మసాలా - టీ స్పూను;  
 • ఉల్లితరుగు - పావు కప్పు;
 • పసుపు - చిటికెడు;
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను;
 • కొబ్బరి తురుము - టీ స్పూను;
 • మటన్ - అర కేజీ;
 • చింతచిగురు - అర కేజీ;
 • ధనియాల పొడి - టీ స్పూను;
 • పుదీనా - చిన్న కట్ట;
 • ఉప్పు - తగినంత;
 • కొత్తిమీర - ఒక కట్ట

విధానం:

బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, గరం మసాలా వేసి వేయించాలి    పుదీనా ఆకు జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి   ఉల్లి తరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొద్దిగా ఉడికించాలి   కొబ్బరి తురుము, ధనియాల పొడి, మటన్, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు జత చేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి (అవసరమనుకుంటే కుకర్‌లో ఉడికించవచ్చు)   మటన్ ఉడికిన తర్వాత చింతచిగురు జత చేసి, బాగా కలిపి తడి పోయేవరకు ఉడికించాలి    కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి.